ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!
- May 23, 2026
దోహా: APCO మరియు హొరైజన్ గ్రూప్ జారీ చేసిన గ్లోబల్ బ్యూరోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్ 2026లో పరిపాలనా సామర్థ్యం మరియు సేవా పనితీరులో ఖతార్ ప్రపంచంలోని అగ్రగామి ప్రభుత్వాలలో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు ఖతార్ జాతీయ ప్రణాళికా మండలి ప్రకటించింది.
ప్రభుత్వ సేవలను పూర్తి చేసే వేగంలో 83.2% స్కోరుతో 'టైమ్' ప్రమాణంలో ఖతార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ట్రాన్సపరెన్సీలో 82.9% స్కోరు, సేవా ఫలితాల విశ్వసనీయతలో 82% స్కోరు, తక్కువ ఆర్థిక, ఆర్థికేతర భారాలతో సేవలను సులభంగా పొందగల సామర్థ్యంలో 81.5% స్కోరు, 'అందుబాటు' (Accessibility)లో 73.1% స్కోరుతో ఖతార్ ప్రాంతీయంగా మొదటి స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది.
వ్యాపారాల విషయానికొస్తే, పారదర్శకతలో ఖతార్ 83.2% స్కోరుతో ఈ ప్రాంతంలో మొదటి స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచింది. సమయపాలనలో 83.4% స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో.. ఊహించగల సామర్థ్యంలో 81.3% స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలు డిజిటల్ సేవల సామర్థ్యాన్ని పెంచడానికి, విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఖతార్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందన్నారు.
ప్రభుత్వ సేవలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగంలో కూడా ఖతార్ అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉంది. సేవలను పొందేటప్పుడు 65% వ్యాపారాలు ఏఐ-సామర్థ్యం గల సాధనాలను ఉపయోగించుకుంటున్నాయని వెల్లడించింది.
గ్లోబల్ బ్యూరోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది.. వ్యక్తులు మరియు వ్యాపారాలు ప్రభుత్వ సేవలను మరియు అధికారిక సవాళ్లను కొలవడానికి రూపొందించిన మొట్టమొదటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రమాణం. వేలాది మంది వినియోగదారుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ ఇండెక్స్ ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







