ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- May 23, 2026
యూఏఈ: హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామనే బెదిరింపులు తీవ్రమైన ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతా పరిణామాలకు దారితీయవచ్చని యూఏఈ హెచ్చరించింది. అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలలో ఈ జలమార్గం పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేసింది.
న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 'కమోడిటీ మార్కెట్లపై అనధికారిక ఇంటరాక్టివ్ డైలాగ్' కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితిలోని యూఏఈ శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి సారా అల్ అవధి పాల్గొని మాట్లాడారు. ఇరాన్ చట్టవిరుద్ధమైన చర్యలు, బెదిరింపులు ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అడ్డంకిగా మారబోతున్నాయని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
అంతర్జాతీయ చట్టాన్ని, ముఖ్యంగా చట్టబద్ధమైన రవాణా హక్కును ఉల్లంఘిస్తూ ఇరాన్ ఈ జలసంధిని చట్టవిరుద్ధంగా మూసివేయడం వల్ల రవాణా, బీమా ఖర్చులు పెరిగాయని అన్నారు. సఫ్లై చైన్ లలో ఇబ్బందులు ఏర్పడి, నిత్యావసర వస్తువుల ధరలలో తీవ్ర అస్థిరత ఏర్పడిందని అల్ అవధి పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాలలో ఒకటిగా ఉందని, ఇది కేవలం ఇంధన సరఫరాల ప్రవాహానికే కాకుండా, ప్రపంచ ఆహార ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలతో సహా కీలకమైన వస్తువుల రవాణాకు కూడా అత్యవసరం అని ఆమె అన్నారు.
జలసంధిలోని ఉద్రిక్తతలకు సంబంధించిన అంతరాయాలు ముఖ్యంగా ఎరువుల మార్కెట్లను ప్రభావితం చేశాయని, నత్రజని ఎరువుల ధరలు 80 శాతం వరకు పెరిగాయని గుర్తుచేశారు. ఈ పెరుగుదల ప్రపంచ ఆహార వ్యవస్థలపై అదనపు ఒత్తిడిని పెంచిందని, ఇప్పటికే ఆహార అభద్రతతో పోరాడుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత తీవ్రతరం చేసిందని ఆమె అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చే అంతర్జాతీయ జలమార్గాలను ఏ ఒక్క దేశమూ బందీగా ఉంచలేదని ఆమె అన్నారు. అంతర్జాతీయ చట్టం మరియు సంబంధిత భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా సముద్ర భద్రతను కాపాడాలని, తద్వారా నౌకాయాన స్వేచ్ఛకు అందరూ కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







