IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- May 24, 2026
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది. లక్నో సూపర్ జెయింట్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 రన్స్ టార్గెట్ ను పంజాబ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 12 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది.
శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. పంజాబ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. 51 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకి అపూర్వ విజయం అందించాడు. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా, పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరడం అనేది రేపటి రెండు మ్యాచుల (ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్) ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







