లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- May 24, 2026
యూఏఈః యూఏఈ లాటరీ మే 23నాటి విజేత సంఖ్యలను ప్రకటించింది. తద్వారా వందలాది మంది ప్లేయర్లకు ఈద్ అల్ అదా సందర్భంగా ముందస్తు బహుమతిని అందించింది. డ్రా సంఖ్య 260523 కోసం, విజేత సంఖ్యల కాంబినేషన్ లో డేస్ విభాగంలో 12, 25, 11, 15, 23, 14, మంత్ సంఖ్య 10గా పేర్కొంది.
ఇక లక్కీ ఛాన్స్ విజేతల IDలు వరుసగా BX4829530, AT1848163, CQ773050 గా ఉన్నాయి. ఈ వారంలో 4,800 మందికి పైగా ప్రజలు వివిధ మొత్తాలను బహుమతులుగా గెలుచుకున్నారు. ఎనిమిది మంది Dh100,000 గెలుచుకోగా, 43 మంది Dh1,000 గెలుచుకున్నారు. సుమారు 4,848 మంది Dh100 గెలుచుకున్నారు, దీంతో మొత్తం విజేతల సంఖ్య 4,889కి చేరింది. కాగా, Dh30 మిలియన్ల జాక్‌పాట్ లేదా Dh5 మిలియన్ల ద్వితీయ బహుమతికి సంబంధించి ఎవరూ విజేతలుగా నమోదు కాలేదన్నారు.
విజేతల వీడియోలు
డ్రాకు ముందు, యూఏఈ లాటరీ గత విజేతలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించింది. తన అదృష్ట సంఖ్యలు లేదా తనకు ఇష్టమైన సంఖ్యల ఆధారంగా విజేత సంఖ్యల కలయికను ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన వెజివే ఎంటామో, తాను గెలుచుకున్న Dh50,000 మొత్తాన్ని తన కుమార్తె విద్య కోసం పక్కన పెడతానని తెలిపారు. మరొక విజేత అయిన హరిష్ షా ఖాన్, గత 21 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఈయన Dh100,000 గెలుచుకున్నారు. తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని తన కుమార్తె వివాహం కోసం వినియోగిస్తానని తెలిపారు.
'Lucky Day' డ్రాలు ప్రతి బుధవారం మరియు శనివారం నిర్వహించబడతాయి. సవరించిన విధానం ప్రకారం, బహుమతుల కోసం పోటీపడేందుకు ఆటగాళ్లకు ప్రతి వారం రెండు అవకాశాలు లభిస్తాయి. తదుపరి డ్రా మే 27న జరగనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







