వాట్సాప్ ఫేక్ కాల్స్‌కు ఇక ఫుల్ స్టాప్!
- May 24, 2026
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌లో స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి.సైబర్ మోసగాళ్లు అంతర్జాతీయ అన్ నౌన్ నంబర్ల నుంచి కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో బ్యాంకు ఉద్యోగులు, డెలివరీ ఏజెంట్లు లేదా కస్టమర్ కేర్ సిబ్బందిగా నటిస్తూ యూజర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.
ఇలాంటి పరిస్థితులలో ఈ స్పెషల్ వాట్సాప్ సెట్టింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ (Whatsapp Spam Calls) నంబర్‌ను బ్లాక్ చేయకుండానే అనవసరమైన కాల్స్ నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చు.
ఈ స్పెషల్ సెట్టింగ్ తెలుసా?
వాట్సాప్‌లో ‘సైలెన్స్ అన్నౌన్ కాలర్స్’ అనే ఇంటర్నల్ ఫీచర్ ఉంది. ఆన్ చేశాక మీరు సేవ్ చేయని లేదా గతంలో మాట్లాడని నంబర్ల నుంచి వచ్చే వాయిస్ వీడియో కాల్స్‌ను ఆటోమేటిక్‌గా సైలెంట్ చేస్తుంది.
కాల్ పూర్తిగా బ్లాక్ అవుతుందని కాదు. ఆ కాల్ మీ ఫోన్ నోటిఫికేషన్లలో వాట్సాప్ కాల్ హిస్టరీలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ, రింగ్ అవ్వదు. తద్వారా పదేపదే వచ్చే అనవసరమైన కాల్స్ నుంచి భారీ రిలీఫ్ లభిస్తుంది.
ఈ సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలి?
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. ముందుగా, వాట్సాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత, సెట్టింగ్స్‌కు వెళ్లండి. ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. కాల్స్ సెక్షన్ ట్యాప్ చేయండి.
మీకు సైలెన్స్ అన్ నౌన్ కాలర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే మీరు ఆప్షన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్ ఆప్షన్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న త్రి డాట్స్ మెనూలో ఉంటుంది. అదే ఐఫోన్లలో అయితే ఈ ఆప్షన్ కింది భాగంలో ఉంటుంది.
ఈ ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి?
ఈ సెట్టింగ్‌లో స్పెషాలిటీ ఏమిటంటే.. ఏ నంబర్‌ను పూర్తిగా బ్లాక్ చేయదు. ఒకవేళ ముఖ్యమైన వ్యక్తి కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే ఆ తర్వాత మిస్డ్ కాల్‌ను చూసుకుని తిరిగి కాల్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వొచ్చు. మీరు ఇంపార్టెంట్ కాల్ మిస్ అయ్యే అవకాశం తగ్గుతుంది.
గతంలో సేవ్ చేయని నంబర్‌కు మెసేజ్ పంపినా లేదా వాయిస్ కాల్స్ చేసినా వాట్సాప్ అన్నౌన్ నంబర్‌గా గుర్తించదు. అందుకే ఆ నంబర్ నుంచి వచ్చే తర్వాతి కాల్స్ సాధారణంగా రింగ్ కావచ్చు. ఈ సమస్య ముఖ్యంగా డెలివరీ ఏజెంట్లు, టెంపరరీ ఆఫీస్ నంబర్లు లేదా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే కాంటాక్ట్‌ల విషయంలో ఇలా జరుగుతుంది.
ఈ ప్రైవసీ ఫీచర్ ఎందుకంటే?
మీరు ఆఫీసు వర్క్, మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా రాత్రిపూట పదేపదే వచ్చే వాట్సాప్ కాల్స్‌తో ఇబ్బంది పడుతుంటే.. ఈ ప్రైవసీ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. స్పామ్ కాల్స్‌ను పూర్తిగా ఆపేయొచ్చు. మీకు ఏయే కాల్స్ రావాలో వద్దో మీరే కంట్రోల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







