అమెరికా వెళ్లే.. ఖతార్ ఫుట్‌బాల్ అభిమానుల కోసం గైడ్ లైన్స్ జారీ..!!
- May 24, 2026
దోహా: 2026 FIFA ప్రపంచ కప్ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (USA) ప్రయాణించే తమ పౌరుల కోసం వాషింగ్టన్‌లోని ఖతార్ రాయబార కార్యాలయం ఒక మార్గదర్శకాల జాబితాను జారీ చేసింది. ఈ జాబితాలో ప్రయాణానికి సంబంధించిన చిట్కాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వివరాలతో పాటు కొన్ని సాధారణ జాగ్రత్త చర్యలను పొందుపరిచారు.
మార్గదర్శకాల పూర్తి జాబితా:
- ప్రయాణ తేదీ నుండి పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలి. తగిన వీసాను పొందాలి. యునైటెడ్ స్టేట్స్లో ఉండటానికి అనుమతించబడిన కాలాన్ని పాటించాలి.
- మోసాలను నివారించడానికి మ్యాచ్ టిక్కెట్లను అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.
- రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వసతి మరియు రవాణాను ముందుగానే బుక్ చేసుకోవాలి.
- వ్యక్తిగత పత్రాలను పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. పాస్‌పోర్ట్‌లు, వీసాలు, టిక్కెట్లు మరియు రిజర్వేషన్ల కాగితపు మరియు ఎలక్ట్రానిక్ కాపీలను వద్ద ఉంచుకోవాలి.
- ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలలోని కంటెంట్‌ను తనిఖీ చేయాలి. అపార్థం చేసుకోగలిగే సున్నితమైన కంటెంట్ లేకుండా చూసుకోవాలి. అలాంటి కంటెంట్ ను స్టోర్ లేదా షేర్ చేయవద్దు.
- నిషేధిత పదార్థాలు లేదా ప్రిస్క్రిప్షన్ లో లేని మెడిసిన్స్ తీసుకువెళ్లవద్దు.
- ఆతిథ్య దేశాలు మరియు నగరాలలోని స్థానిక చట్టాలను పాటించండి.
- రద్దీగా ఉండే ప్రదేశాలలో చోరీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన రవాణా మార్గాలను మాత్రమే ఉపయోగించాలి.
- టోర్నమెంట్ సమయంలో FIFA మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన అధికారిక సూచనలను పాటించాలి. ఏవైనా తాజా సమాచారం తెలుసుకోవడానికి ఫీఫా ప్రపంచ కప్ 2026 యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించాలి.
అత్యవసర పరిస్థితుల్లో, రాయబార కార్యాలయం లేదా రాష్ట్ర మిషన్లను సంప్రదించాల్సిన నంబర్లు:
వాషింగ్టన్, డి.సి.లోని ఖతార్ రాయబార కార్యాలయం+1 (202) 320-0803
లాస్ ఏంజిల్స్‌లోని ఖతార్ కాన్సులేట్ జనరల్+1 (424) 239-9903
న్యూయార్క్‌లోని ఖతార్ కాన్సులేట్ జనరల్+1 (631) 612-7035
హ్యూస్టన్‌లోని ఖతార్ కాన్సులేట్ జనరల్+1 (713) 355-7333
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







