ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- May 25, 2026
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అబ్షర్.. ఏప్రిల్ నెలలో మొత్తం 16,536,826 (16.5 మిలియన్లకు పైగా) ఎలక్ట్రానిక్ లావాదేవీలు మరియు సేవలను నిర్వహించింది.
అబ్షర్ ఇండివిడ్యువల్స్ ద్వారా మొత్తం 13,973,584 (13.9మిలియన్) లావాదేవీలు పూర్తయ్యాయి. వీటిలో, అబ్షర్ యాప్ ద్వారా పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు అందుబాటులో ఉన్న డిజిటల్ వాలెట్ ఫీచర్ ద్వారా జరిగిన 3,609,072 (3.6మిలియన్) డాక్యుమెంట్-వ్యూయింగ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అబ్షర్ బిజినెస్ 2,563,242 (2.5 మిలియన్) లావాదేవీలను నమోదు చేసింది.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీకి సంబంధించిన లావాదేవీలు 3,417,847(3.4మిలియన్)కి చేరుకున్నాయి. ఇందులో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ద్వారా 3,307,760(3.3 మిలియన్) సేవలు కూడా ఉన్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ 2,202,603(2.2మిలియన్) లావాదేవీలను నమోదు చేయగా, మంత్రిత్వ శాఖకు చెందిన ఏజెన్సీ ఆఫ్ సివిల్ అఫైర్స్ 576,236 (0.5మిలియన్) లావాదేవీలను పూర్తి చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







