కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ తో మాగల్ఫ్ ముఖాముఖీ

- May 25, 2026 , by Maagulf
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ తో మాగల్ఫ్ ముఖాముఖీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశాలు ఏమిటి?
-పెద్ది అద్భుతమైన కథ. నా పాత్ర కూడా చాలా బాగుంది. ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించింది. ఒక మంచి పాత్ర చేశాననే ఆనందం ఉంది.

మీరు చేసిన గౌర్నాయుడు పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
-గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు.

ఇందులో మీది రామ్ చరణ్ కి కోచ్ పాత్రేనా?
-కోచ్ పాత్రలానే ఉంటుంది. పెద్ది పాత్ర జర్నీ చాలా అద్భుతంగా సాగుతుంది. ఆ ప్రయాణంలో ఎన్నో పాత్రలు వస్తాయి. నేను చేసిన గౌర్నాయుడు పాత్ర విషయానికి వస్తే, పెద్ది-గౌర్నాయుడు మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్  ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి?
-ఈ సినిమాతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని నేను భావిస్తున్నాను. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటాయి. చాలా కష్టపడి, ఏకాగ్రతతో ఈ పాత్ర చేశారు. ఆయన అద్భుతమైన నటుడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ పాత్ర కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. పూర్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయి, ఎంతో నిజాయితీగా చేశారు.

‘పెద్ది’ షూటింగ్ జర్నీ ఎలా అనిపించింది?
-రామ్ చరణ్, దర్శకుడు, టెక్నీషియన్స్ అందరూ నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అందరం ఒక కుటుంబంలా కలిసి పనిచేశాం. వారి సహకారంతో నా పాత్రను మరింత బాగా చేయగలిగాను.

దర్శకుడు బుచ్చిబాబు గురించి?
-బుచ్చిబాబు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన మేకింగ్, టేకింగ్ సూపర్. కథకు ఏం అవసరమో అదే తెరకెక్కించారు. ఆయన స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన ఫెంటాస్టిక్ డైరెక్టర్.

సినిమాలోని ఇతర పాత్రల గురించి?
-నా పాత్రతో పాటు జగపతిబాబు పాత్ర, అలాగే మిగతా అన్ని పాత్రలను కూడా బుచ్చిబాబు గారు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే డీవోపీ రత్నవేలు గారు ఇచ్చిన విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.

సినిమాలో మల్టిపుల్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా?
-అవును. ఇందులో పలు క్రీడలు ఉంటాయి. అయితే ప్రతి క్రీడ కథతో చాలా బలంగా అనుసంధానమై ఉంటుంది. ఆ అంశాన్ని ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై ఎంతో ఎంజాయ్ చేస్తారు.

క్లైమాక్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. అది ఎలా ఉండబోతోంది?
-చాలా సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్ ఉంటుంది. దాన్ని మీరు థియేటర్‌లో చూసి ఆస్వాదించాలి. పెద్ది జర్నీ చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.

నిర్మాత సతీష్ గురించి?
-సతీష్ సినిమాపై చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఒక పాత్ర చేయడానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది?
-దర్శకుడు కథ చెప్పిన తర్వాత నేను ఒక విధమైన స్టైల్‌ను అనుకుంటాను. దాన్ని దర్శకుడితో చర్చిస్తాను. తర్వాత ఆయన సూచనలు, నా ఆలోచనలు కలిపి ఒక అవగాహనతో ఆ పాత్రను చేస్తాను.

మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?
-నాకు మనసుకు నచ్చిన పాత్రలు చేయడం ఇష్టం. పెద్దిలో చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
-ప్రస్తుతం ‘గుమ్మడి నరసయ్య’, ‘జైలర్ 2’ చిత్రాలు చేస్తున్నాను. మంచి కథలు వస్తే తప్పకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com