కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- May 26, 2026
కువైట్: కువైట్ జాతీయ ఆహార భద్రతా వ్యవస్థ బలోపేతం, సబ్సిడీలను పునర్‌వ్యవస్థీకరించడం లక్ష్యంగా ఒక సమగ్ర సంస్కరణల ప్యాకేజీని డెవలప్ మెంట్ మరియు సస్టైనబులిటీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రీమ్ అల్-ఫులైజ్ ప్రకటించారు. వ్యవసాయ ప్లాట్ల విభాగం, పశువుల మేత పంపిణీ కేంద్రం, వ్యవసాయ వ్యవహారాలు మరియు మత్స్య వనరుల ప్రజా ప్రాధికార సంస్థ ప్రధాన పరిపాలనా భవనాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.
అన్ని రకాల భూకమతాల కోసం కొత్త దరఖాస్తులను నిలిపివేస్తున్నట్లు, అలాగే అథారిటీ వద్ద గతంలో నమోదైన దరఖాస్తులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భూ యజమానులు మరియు ప్లాట్ల యజమానులు వర్తించే చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉల్లంఘనలు మరియు ఏకపక్ష పద్ధతులను సహించబోమని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పశువుల పెంపకందారుల రికార్డులను ధృవీకరించడానికి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు, ఏవైనా అవకతవకలు జరిగినట్లు తేలితే వాటిని సంబంధిత అధికారులకు నివేదించనున్నట్లు అల్-ఫులైజ్ తెలిపారు.
లబ్ధిదారుల కోసం కనీస అర్హత పరిమితులను 50 గొర్రెలు మరియు మేకలు, 15 ఒంటెలు మరియు పశువులుగా నిర్ధారించినట్లు తెలిపారు. కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన కమతాలకు చెల్లింపులను కూడా నిలిపివేస్తామని అన్నరు.
పరిపాలనా సంస్కరణ మరియు ప్రజా నిధుల పరిరక్షణపై, అథారిటీలోని ఆర్థిక మరియు పరిపాలనా అవకతవకలను పరిశీలించడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు అల్-ఫులైజ్ వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడంలో అథారిటీ పాత్రను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన విస్తృత సంస్కరణల ప్రణాళికలో ఇది తొలి అడుగు అని అల్-ఫులైజ్ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







