VFS వీసా అపాయింట్మెంట్లలో కొత్త చిక్కులు..తప్పక మీరు తెలుసుకోవాలి
- May 29, 2026
న్యూ ఢిల్లీ: భారత్‌లోని VFS గ్లోబల్ (VFS) కేంద్రాల్లో సర్వీసుల తీరుపై యూరోపియన్ యూనియన్ (EU) ఇటీవల అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో స్కెంజెన్, యూకే వీసాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్న వేళ.. అపాయింట్మెంట్ల లభ్యత, సేవల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీనివల్ల ఇకపై డాక్యుమెంట్ల స్క్రీనింగ్ మరింత కఠినంగా ఉండనుంది. ఈ పరిణామం వేల సంఖ్యలో భారతీయ పర్యాటకులు, విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపనుంది. వీసా స్లాట్లు దొరక్క భారతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్నికల్ సమస్యలను ఆసరాగా చేసుకుని థర్డ్ పార్టీ ఏజెంట్లు అపాయింట్మెంట్లను బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దరఖాస్తుదారులు ఖరీదైన ‘ప్రీమియం లాంజ్’ సేవలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో అఫీషియల్ పోర్టల్‌ను చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత డేటా భద్రత దృష్ట్యా అనధికార బ్రోకర్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. స్కెంజెన్, యూకే వీసా అపాయింట్మెంట్లపై ప్రభావం ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో VFS కేంద్రాల పనితీరును EU ప్రతినిధులు నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా డేటా ప్రైవసీ, సర్వీస్ ఫీజుల పారదర్శకతపై తనిఖీలు చేపట్టారు. అదనపు ఛార్జీలు లేకుండానే సామాన్యులకు అపాయింట్మెంట్లు దొరకాలని వారు స్పష్టం చేస్తున్నారు. దరఖాస్తుదారులు తమ ఫామ్‌లోని ప్రతి వివరమూ పాస్‌పోర్ట్‌తో సరిగ్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. చిన్న తప్పు దొర్లినా వీసా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ వీసా అపాయింట్మెంట్ అకస్మాత్తుగా రద్దయితే, వెంటనే సంబంధిత ఎంబసీని సంప్రదించి సలహా తీసుకోండి.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







