దుబాయ్‌లో ఘనంగా మహానాడు వేడుకలు
- May 29, 2026
దుబాయ్: మహానాడు సందర్భంగా దుబాయ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు, గుర్తులతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తెలుగుదేశం పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవం, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో *యూఏఈ టీడీపీ అధ్యక్షులు మోతుకూరి విశ్వేశ్వరరావు, కోడి రాజా రవి కిరణ్, ప్రసాదు దారాపనేని, సునీల్ బోయపాటి, వర ప్రసాద్ కందిబేడల(సౌదీ), మధుసూదన్ తాళ్లూరి, శివ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు.
మహానాడు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని, తెలుగు ప్రజల అభ్యున్నతి మరియు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







