మూడో ఫ్లోర్ విండో నుంచి పడ్డ బాలిక: తీవ్రగాయాలు
- August 09, 2016
ఎనిమిదేళ్ళ బాలిక, తాను నివసిస్తున్న భవంతి మూడో ఫ్లోర్ విండో నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి, తీవ్రగాయాల పాలయ్యింది. బాధితురాలు ఇండియాకి చెందిన బాలికగా గుర్తించారు పోలీసులు. అల్ ఖువాయిర్‌లోని ఓ భవనంలో ఈప్రమాదం చోటు చేసుకుంది. బద్ర్ అల్ సమా ఆసుపత్రికి చెందిన అధికారి మాట్లాడుతూ, ఉదయం 10.35 ప్రాంతంలో తీవ్ర గాయాలతో ఉన్న బాలికను ఆమె తల్లి తమ వద్దకు తీసుకువచ్చారనీ, ఆమె తల నుంచి రక్తం కారుతోందని చెప్పారు. బాధితురాల్ని వెంటనే కాజువాలిటీ వార్డ్‌కి తరలించి, చికిత్స అందించామన్నారు. అనంతరం ఆమెను ఖౌలా హాస్పిటల్‌కి తరలించామని, అక్కడ అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆ బాలిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్స పొందుతోంది ఖౌలా హాస్పిటల్‌లో.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







