జోర్డాన్‌ నుంచి అబుదాబీకి ఒమన్‌ ఎయిర్‌ విమానం మళ్ళింపు

- August 09, 2016 , by Maagulf
జోర్డాన్‌ నుంచి అబుదాబీకి ఒమన్‌ ఎయిర్‌ విమానం మళ్ళింపు

ఒమన్‌ ఎయిర్‌కి చెందిన విమానం డబ్ల్యువై 414 మళ్ళించబడింది. అమ్మన్‌, జోర్డాన్‌ నుంచి మస్కట్‌కి వెళ్ళాల్సిన ఈ విమానం అబుదాబీకి డైవర్ట్‌ చేయబడింది. సాంకేతిక కారణాలతో ఈ మళ్ళింపు జరిగినట్లు ఒమన్‌ ఎయిర్‌ వర్గాలు అధికారికంగా వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించాయి. అమ్మమన్‌ నుంచి సాయంత్రం 7.50 నిమిషాలకు ఆదివారం టేకాఫ్‌ అయి, మస్కట్‌కి తెల్లవారుఝామున 12.20 నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం అబుదాబీ ఇంటర్నేషయల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 4 గంటలకు ల్యాండ్‌ అయ్యింది. ప్రయాణీకులు ఈ మళ్ళింపుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఉదయం 10.45 నిమిషాలకు అబుదబీ నుంచి మస్కట్‌కి విమానం బయల్దేరినట్లు ఒమన్‌ ఎయిర్‌ వర్గాలు వివరించాయి. జులై 28న చెన్నయ్‌కి వెళ్ళాల్సిన ఒమన్‌ ఎయిర్‌ విమానం మస్కట్‌ నుంచి వెళుతూ గోవాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. విమాన ప్రయాణీకుడికి అస్వస్థత తలెత్తడంతో ఎమర్జన్సీ ల్యాండ్‌ చెయ్యాల్సి వచ్చింది. ప్రయాణీకురాలు ఒకరు తీవ్ర గుండెనొప్పితో బాధపడ్డారు. అయితే విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com