ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- May 30, 2026
మస్కట్: ఒమన్ లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48°C మార్కుకు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో దిమా వా అల్ తాయీన్‌లో 47.6°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
ఇతర అనేక ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్ రుస్తాఖ్ మరియు అల్ కామిల్ వా అల్ వాఫీలలో చెరో 47.4°C నమోదు కాగా, సుర్‌లో 47.3°C మరియు బిద్బిద్‌లో 47.2°C నమోదయ్యాయి. ఫాహుద్‌లో 47.0°C, బౌషర్‌లో 46.9°C, అల్ అమెరాత్‌లో 46.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యంత వేడి ప్రదేశాల జాబితాలో ఉన్న సునైనాలో 46.6°C, నఖల్‌లో 46.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒమన్ అంతటా వేసవి వాతావరణ తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో వేడి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో ఎక్కువసేపు నేరుగా ఎండలో ఉండకుండా ఉండాలని, అలాగే తగినంత నీరు తాగాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







