కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- May 31, 2026
కువైట్: అత్యంత ముఖ్యమైన కాలాలలో ఒకటైన “అల్ తురయా” సీజన్లోకి కువైట్ జూన్ 7న ప్రవేశిస్తుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ సీజన్ 13 రోజుల పాటు ఉంటుందని పేర్కొంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, అలాగే వాయువ్య “అల్-బవారిహ్” గాలుల కార్యకలాపాలు అధికమవుతాయని తెలిపింది. అల్ తురయా సమయంలో వేడి, పొడి వాతావరణం ఉంటుందని, చెట్లు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది. ఈ కాలంలో సూర్యుడు తన అత్యంత ఉత్తర బిందువుకు సమీపంలో ఉదయించి, అస్తమిస్తాడని పేర్కొంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సైంటిఫిక్ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







