మస్కట్‌లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- May 31, 2026
మస్కట్: అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మస్కట్‌లోని ఖురుమ్ బీచ్‌లో పీస్ వాక్, బీచ్ క్లినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మస్కట్‌లోని నేపాల్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రవాస నేపాలీ సోషల్ క్లబ్/నేపాలీ సంస్థల ప్రతినిధులతోపాటు విదేశీ మిత్రులు పాల్గొన్నారని తెలిపింది. ఈ సందర్భంగా పాల్గొన్నవారికి రాయబారి దోర్నాథ్ ఆర్యల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాస నేపాలీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మరియు ఒమన్‌లోని నేపాలీ సమాజ ప్రతిష్టను పెంచడంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఎవరెస్ట్ దినోత్సవం, నేపాల్ గణతంత్ర దినోత్సవం రెండు ఒకేరోజు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మస్కట్‌లోని నేపాల్ రాయబార కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయబారి ఆర్యల్ నేపాల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఇ-మ్యూజియంను లాంఛనంగా ప్రారంభించారు. ఇ-మ్యూజియంలో అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించి, తమ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







