డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- May 31, 2026
మనామా: బహ్రెయిన్ లో తన ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే, సదరు బహ్రెయిన్ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అతడి చర్యతో ఫిలిప్పీనా అయిన ఆ బాధితురాలు తన ఎడమ చెవిలో మూడింట ఒక వంతును కోల్పోవల్సి వచ్చింది. ఈ గాయం వల్ల ఏడు శాతం వైకల్యం ఏర్పడినట్లు డాక్టర్లు నివేదికలో తెలిపారు.
35 ఏళ్ల నిందితుడు గతంలో మానసిక వైద్య ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, అతను పూర్తిగా కోలుకున్నాడని అతని కుటుంబం కోర్టులో వాధించారు. తమ సోదరుడు వింతగా ప్రవర్తించడానికి కారణం, ఆ పనిమనిషి 'మంత్రం వేయడమే' అని అతని సోదరీమణులు ఆరోపించారు.
కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణల సమయంలో ఆ వ్యక్తి ఆరోపణలను అంగీకరించాడు. కానీ ఆ సంఘటన పొరపాటున జరిగిందని వాదించాడు.
ఇదిలా ఉండగా, 47 ఏళ్ల ఫిలిప్పీనా మహిళ అంతకుముందు సాక్ష్యం ఇస్తూ, నిందితుడు ఎటువంటి కారణం లేకుండా వాగ్వాదాన్ని ప్రారంభించాడని, అది ముదిరి చివరికి తన చెవిలో కొంత భాగాన్ని కోల్పోయేలా చేసిందని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







