20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- May 31, 2026
యూఏఈ: సౌదీ అరేబియాకు వెళ్లే విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్న ఒక అరబ్ మహిళ పోగొట్టుకున్న బ్యాగ్‌ను, అందులోని విలువైన వస్తువులతో సహా దుబాయ్ పోలీసులు చివరి నిమిషంలో అందజేశారు. మానాశ్రయంలోని ఒక ప్రదేశంలో టెర్మినల్ 1 ఉద్యోగి ఒక నల్లటి బ్యాగ్‌ను గుర్తించి అధికారులకు అప్పగించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ బ్యాగ్‌లో 20,000 డాలర్లు, 150 గ్రాముల బంగారం, ఇతర కరెన్సీలు, వివిధ బ్రాండ్లకు చెందిన మొబైల్ ఫోన్లు మరియు వ్యక్తిగత పత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పత్రాల ఆధారంగా సదరు మహిళను గుర్తించానికి ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.
సదరు మహిళ సౌదీ అరేబియాకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు గుర్తించారు. ఆమె తన బ్యాగ్ పోగొట్టుకుందని, ఏమీ చేయాలో తెలియక ఆందోళన చెందుతోందని, ఈ క్రమంలో తన విమానాన్ని కోల్పోతానేమోనని భయపడుతోందని పోలీసులు తెలిపారు.
మహిళను వెంటనే సంప్రదించి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, ఆమె వద్ద అవసరమైన అన్ని అనుమతులు మరియు పత్రాలు ఉన్నాయని ధృవీకరించుకున్న తర్వాత ఆ బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అప్పగించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
ఇదేవిధంగా ఈ నెల ప్రారంభంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1లో సుమారు 2 మిలియన్ దిర్హమ్ల విలువైన వెండి బార్ లు ఉన్న ఒక హ్యాండ్‌బ్యాగ్‌ను అధికారులు ఒక ఆసియా ప్రయాణికుడికి తిరిగి ఇచ్చారు. ఏప్రిల్ 22న, దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో ఒక పర్యాటకుడు తన పాస్‌పోర్ట్ మరియు ఐఫోన్‌ను పోగొట్టుకున్న కొన్ని గంటల్లోనే వాటిని తిరిగి అందజేశారు. మొత్తంగా 2025లో 1,71,490 పోగొట్టుకున్న వస్తువులను వాటి యజమానులకు తిరిగి ఇచ్చినట్టు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







