IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- May 31, 2026
ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 20 ఓవర్లలో 155/8 స్కోరుకే పరిమితం చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న రాజత్ పాటిదార్ నిర్ణయం ఫలించినట్టైంది. ఆర్సీబీ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ గుజరాత్ బ్యాటర్ల పై ఒత్తిడి పెంచారు.
టాప్ ఆర్డర్ వైఫల్యం
మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ త్వరగానే పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత జోస్ బట్లర్, నిశాంత్ సింధు కొంతసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. దీంతో ఒక దశలో గుజరాత్ 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
వాషింగ్టన్ సుందర్ పోరాటం
మధ్యలో అర్షద్ ఖాన్ వేగంగా 15 పరుగులు చేసి కొంత ఊపు తీసుకొచ్చాడు. అయితే ఇన్నింగ్స్‌కు అసలైన బలంగా నిలిచింది వాషింగ్టన్ సుందర్ అర్ధశతకమే. ప్రారంభంలో ఒక జీవనదానం పొందిన సుందర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అజేయ అర్ధశతకం నమోదు చేశాడు. చివరి వరకు నిలిచి జట్టును 150 పరుగుల మార్క్ దాటించాడు.
ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ అత్యుత్తమ ప్రదర్శనతో మూడు వికెట్లు సాధించాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రునాల్ పాండ్యా కీలక సమయంలో జోస్ బట్లర్ వికెట్ తీసి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మళ్లించాడు. ఇప్పుడు వరుసగా రెండో టైటిల్ సాధించాలంటే ఆర్సీబీ 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







