FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- June 04, 2026
- ఐసీఎంఈఐ నుంచి అంతర్జాతీయ గుర్తింపు
- ఇంద్రియ జ్యుయలర్స్ వేదికగా ఘనంగా విజయోత్సవ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి అనీషా ముఖర్జీ హాజరు
విజయవాడ: ఎఫ్టీపీసీ ఇండియా మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకొని తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది.అంతర్జాతీయ మీడియా, వినోద రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ’ (ICMEI) నుంచి గుర్తింపు లభించిన సందర్భంగా గురువారం ఎంజీ రోడ్డులోని ఇంద్రియ జ్యుయలర్స్ వేదికగా ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్ చైతన్య జంగా మాట్లాడుతూ, ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలిపారు.మీడియా, చలనచిత్ర, వినోద, వ్యాపార రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా దీనిని అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో భాగస్వామ్యాలు పెరగడంతో పాటు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి కోసం సభ్యులు, ప్రతినిధులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడం, యువతకు అవకాశాలు కల్పించడం, వివిధ రంగాల మధ్య సమన్వయం పెంపొందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంస్థ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థ జనరల్ సెక్రటరీ వీఎస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ, ఐసీఎంఈఐ గుర్తింపు ఎఫ్టీపీసీ ఇండియాకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయి సంస్థలతో అనుసంధానం పెంచి సభ్యులకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటి అనీషా ముఖర్జీ మాట్లాడుతూ, భారతీయ ప్రతిభను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఎఫ్టీపీసీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. సృజనాత్మక రంగాల్లో ముందుకు రావాలనుకునే యువతకు ఎఫ్టీపీసీ ఇండియా వంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఐ.టీ వింగ్ చైర్మన్ కోడె చైతన్య,సినీ నిర్మాత ఈశ్వర్ మిత్తాన, ఫోటోగ్రఫీ చైర్మన్ రామిశెట్టి అప్పారావు, హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు ఇమ్మానుయేల్ పోకల్కర్, జన్ను పవన్ కుమార్, ఇంద్రియ జ్యూవిలరీ ఫ్లోర్ మేనేజర్ నవీన్,పలువురు మీడియా, వ్యాపార, వినోద రంగాలకు చెందిన ప్రముఖులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎఫ్టీపీసీ ఇండియాకు లభించిన అంతర్జాతీయ గుర్తింపును పురస్కరించుకొని విజయోత్సాహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..







