ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- June 13, 2026
అబుదాబి: యూఏఈ నుంచి ఇరాన్‌కు నిధులు బదిలీ చేసినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను యూఏఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా 3 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల బదిలీకి సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఇరాన్‌కు చెందిన ఎలాంటి స్తంభింపజేసిన (ఫ్రోజన్) నిధులు విడుదల కాలేదని, బదిలీ చేయలేదని, అలాంటి లావాదేవీలకు యూఏఈ ఎలాంటి సౌకర్యం కల్పించలేదని పేర్కొంది.
ఇరాన్‌కు భారీ మొత్తంలో నిధులు తరలించారనే వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
అదేవిధంగా, వార్తా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారిక వనరుల నుంచి సమాచారం సేకరించి మాత్రమే వార్తలను ప్రచురించాలని యూఏఈ సూచించింది. ధృవీకరించని సమాచారం, నిరాధార ఆరోపణలను ప్రచారం చేయకుండా మీడియా సంస్థలు జాగ్రత్త వహించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ నేపథ్యంలో యూఏఈ తన ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, అంతర్జాతీయ నిబంధనల పట్ల కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







