కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- June 18, 2026
కువైట్: హెయిర్ ఆయిల్స్ మరియు విడిభాగాలని ప్రకటించిన మూడు ఇన్‌బౌండ్ కంటైనర్లలో డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని కస్టమ్ అధికారులు భగ్నం చేశారు. ఒక యూరోపియన్ దేశం నుండి దేశంలోకి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారని కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది.
కస్టమ్స్ అధికారుల ప్రకటన ప్రకారం, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియ సమయంలో సరుకులలోని వస్తువులపై ఇన్స్పెక్టర్లకు అనుమానం కలగడంతో వాటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వాటిల్లో దాచిపెట్టిన "కెమికల్" అని పిలవబడే మాదకద్రవ్య పదార్థంగా అనుమానిస్తున్న సుమారు ఐదు కిలోగ్రాముల ద్రవం వాటిలో గుర్తించారు. అన్ని కస్టమ్స్ పోర్టులలో పర్యవేక్షణను కఠినతరం చేయడానికి మరియు నిషేధిత పదార్థాల స్మగ్లింగ్ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి తాము కట్టుబడి ఉన్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







