దుబాయ్ షేక్ జాయెద్ రోడ్‌లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- June 18, 2026
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్‌లోని ఒక భవనంలో గురువారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదాన్ని దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. నిర్వహణ పనులు (మెయింటెనెన్స్) జరుగుతున్న అంతస్తులో ఈ మంటలు చెలరేగాయని, సేఫ్టీ విధానాలకు అనుగుణంగా 'కూలింగ్' ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆ భవనం నుండి దట్టమైన పొగలు ఎగసిపడటం చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు చేపట్టిన భద్రతా చర్యలలో భాగంగా, ఆ భవనం చుట్టూ ఉన్న ప్రాంతంలోకి వాహనాలు మరియు పాదచారులు రాకుండా ఆంక్షలు విధించారు. ఆస్తి నష్టంతోపాటు ప్రమాదంపై విచారణ జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







