సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- June 23, 2026
విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక మాజీ సీఐ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును(CI Nagaraju)సిట్ అధికారులు విజయవాడలోని సింగ్‌నగర్‌లో అరెస్ట్ చేశారు.
ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారుల బృందం మంగళవారం ఉదయం సీఐ నాగరాజు ఇంటికి వెళ్లింది. సిట్ బృందం రావడంతో నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి నాగరాజును అరెస్టు చేసి విచారణ నిమిత్తం పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అయితే, అరెస్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సీఐ నాగరాజుపై ఇప్పటికే అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్‌లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్‌లు ప్రారంభం..
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్‌లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







