సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్

- June 25, 2026 , by Maagulf
సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్

యూఏఈ: సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివేళలను దుబాయ్ మరోసారి ప్రకటించింది. జూన్ 29 నుండి సెప్టెంబర్ 10 వరకు కొనసాగే 'అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్' ప్రభుత్వ సంస్థలకు వీలు కల్పించే రెండు పని విధానాలను పరిచయం చేస్తోంది. ఈ కార్యక్రమం కింద, మొదటి గ్రూపులోని ఉద్యోగులు సోమవారం నుండి గురువారం వరకు రోజుకు ఏడు గంటలు మరియు శుక్రవారం నాలుగున్నర గంటలు పని చేస్తారు. రెండవ గ్రూపులోని ఉద్యోగులు సోమవారం నుండి గురువారం వరకు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తారు. శుక్రవారాన్ని సెలవు దినంగా పొందుతారు.

ప్రభుత్వ సంస్థలు కూడా తమ అవసరాలు మరియు పని స్వభావానికి అనుగుణంగా, ఆమోదించబడిన సౌకర్యవంతమైన పని వేళలు మరియు రిమోట్ వర్కింగ్ ఏర్పాట్లను అమలు చేసే అవకాశాన్ని కల్పించారు. వేసవిలో ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలకు మరియు వృత్తిపరమైన బాధ్యతలను కుటుంబంతో సమతుల్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని 2024లో దుబాయ్ ప్రారంభించింది.  ఉద్యోగుల అవసరాలను అధ్యయనం చేసి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం (DGHR) ఒక సౌకర్యవంతమైన వర్క్ మోడల్ ను అభివృద్ధి చేసింది.  

ఈ నెల ప్రారంభంలో, మానవ వనరుల మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ.. తీవ్రమైన వేసవి ఎండల నేపథ్యంలో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు యూఏఈ అంతటా బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com