సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- June 30, 2026
రియాద్: సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి సహకరించడం, వారికి ఆశ్రయం కల్పించడం లేదా ఏ రకమైన సహాయం లేదా సేవనైనా అందించడం వంటి చర్యలకు పాల్పడే వారికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష మరియు 1 మిలియన్ సౌదీ రియాల్ల (SR) వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అలాగే, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని మరియు వారికి ఆశ్రయం కల్పించడానికి ఉపయోగించిన ఆస్తిని జప్తు చేయడంతోపాటు తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నివాస, కార్మిక మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారి గురించి సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఇందుకోసం మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ (Eastern Province) ప్రాంతాలలో 911 నంబర్‌కు, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలలో 999 నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







