జనసేన సీక్వెల్‌కి 2017 డిసెంబర్‌లో ముహూర్తం ..
- August 11, 2016
గబ్బర్‌సింగ్ సీక్వెల్ డిజాస్టర్ ఐతే కావచ్చు.. జనసేన సీక్వెల్‌ని ఓ రేంజ్‌లో ఆడించాలని పవర్ స్టార్ పూనుకున్నారా? పడుకుండి పోయిందనున్న జనసేన పార్టీకి జవసత్వాల్నిచ్చి సరికొత్తగా ప్రజెంట్ చేయాలని 2019 ఎన్నికలకు సన్నద్ధం కావాలని పవన్ కల్యాణ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనికి 2017 డిసెంబర్‌లో ముహూర్తం కూడా ఖాయమైనట్టు ఒక ఇంటర్నల్ న్యూస్. రాజకీయ పార్టీకి వుండాల్సిన ఏ ఒక్క లక్షణం కూడా జనసేనకు లేదని, కనీస కార్యవర్గ నిర్మాణం కూడా జరగలేదని, కానీవాళ్లు కత్తులు నూరుతుంటే కార్యాచరణలోకి దిగాల్సిన కంపల్సరీ పరిస్థితి కల్యాణ్ బాబుది.ప్రశ్నించడంలో స్పెషలిస్టునని చెప్పుకునే పవన్‌కల్యాణ్, తాను ప్రశ్నించాల్సిన సందర్భాలు రెండు తెలుగురాష్ర్టాల్లో అనేకానేకం కనిపిస్తున్నా తను స్పందించిన సందర్భాలు మాత్రం అతి తక్కువ. తుళ్లూరు నిర్వాసితుల గోడు వినడానికి ఒక్కసారి మాత్రమే జనంలోకి వచ్చినట్టు గుర్తు. మిగతా అంతా తన ఫాంహౌస్‌లోనో, సర్దార్ షూట్‌లోనో మాత్రమే బిజీగా వుండేవాడు. జనసేనకు సంబంధించిన ఎటువంటి కార్యాచరణ కూడా జరుగుతున్న దాఖలా లేదు.ఆ మధ్య పాలిటిక్స్ విషయమై తన సన్నిహితులతో మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి ప్రిపరేషన్ వర్క్ మొదలుపెడతానని పవన్ చెప్పినట్టు వార్తలొచ్చాయి. అంటే 2017 డిసెంబర్ నుంచి జనసేన యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నట్లు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. యాక్షన్ ప్లాన్ రాసుకుని, రాజకీయ పొత్తుల మీద స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకుని... 2017 డిసెంబర్‌లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి జనానికి జనసేన రీఇంట్రడ్యూస్ అవుతుందని ఫ్యాన్ క్లబ్‌లోనూ, ఫిల్మ్‌నగర్‌లోనూ చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







