జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- July 03, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ కు జూన్ నెలలో ఎమర్జెన్సీ నెంబర్ అయిన 911 కు 26.3 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయి. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రాంతాలకు సేవలందించే ఈ అత్యవసర నంబర్ ద్వారా మొత్తం 2,631,374 కాల్‌లను స్వీకరించినట్లు నేషనల్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.
911 ఆపరేషన్స్ కేంద్రాలు అత్యవసర కాల్‌లను స్వీకరించి, వాటిని సంబంధిత భద్రతా మరియు సేవా విభాగాలకు మళ్లిస్తాయి. ఇందుకోసం అధునాతన ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగిస్తారు.వీటిని ఫుల భాషల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలూ నిర్వహిస్తుంటారు.
అత్యధికంగా రియాద్‌లో 1,112,499 కాల్లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మక్కా 790,294 కాల్లు, తూర్పు ప్రావిన్స్ 501,635 కాల్లు మరియు మదీనా 226,946 కాల్లు ఉన్నాయని నేషనల్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







