కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- July 06, 2026
కువైట్ : కువైట్ విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత (సెకండ్ రౌండ్) పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు సైన్స్, ఆర్ట్స్, మత విద్య (రిలిజియస్ ఎడ్యుకేషన్) విభాగాల వారీగా పరీక్షల తేదీలను ఖరారు చేసింది. 10వ మరియు 11వ తరగతి విద్యార్థుల రెండో విడత పరీక్షలు వచ్చే ఆదివారం ప్రారంభమై జూలై 22 వరకు కొనసాగనున్నాయి. 12వ తరగతి సైన్స్ విభాగం విద్యార్థులకు రెండో విడత పరీక్షలు వచ్చే గురువారం ప్రారంభమై జూలై 21 వరకు జరుగుతాయి. అదే రోజు ఆర్ట్స్ విభాగం పరీక్షలు కూడా ప్రారంభమై, జూలై 22న ముగియనున్నాయి. ఇక మత విద్య (రిలిజియస్ ఎడ్యుకేషన్) విభాగానికి చెందిన 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు వచ్చే బుధవారం ప్రారంభమై జూలై 22 వరకు కొనసాగుతాయని విద్యాశాఖ వెల్లడించింది.
పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు, విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ఈ షెడ్యూల్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు షెడ్యూల్‌ను పరిశీలించాలని, పరీక్షల తేదీలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా, అబ్దుల్లా అల్-సలెమ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. ప్రవేశం పొందిన అభ్యర్థులు తమ ఈ-మెయిల్ ను పరిశీలించి, నిర్దేశిత గడువులోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!







