సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- July 06, 2026
రియాద్: సౌదీ అరేబియాలో రానున్న మూడు రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది. మక్కా, మదీనా ప్రాంతాల్లోని పలు ప్రాంతాలతో పాటు తూర్పు ప్రావిన్స్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లవద్దని, తగినంత నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో కావాలని ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







