సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- July 07, 2026
రియాద్:సౌదీ అరేబియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ (డిజిటల్ ఎకానమీ) పరిమాణం, ప్రభావాన్ని అంచనా వేసేందుకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రత్యేక సర్వేను ప్రారంభించింది. డిజిటల్ సాంకేతికతలను ఆధారంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను గుర్తించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఈ సర్వే ద్వారా డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, డేటా వంటి అంశాలపై అధికంగా ఆధారపడే సంస్థలను గుర్తించనున్నారు. అలాగే డిజిటల్ వనరుల వినియోగంతో తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సంస్థల వివరాలను కూడా సేకరించనున్నారు.సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లో వివిధ ఆర్థిక రంగాలకు చెందిన ప్రతినిధి సంస్థల నుంచి ఈ సర్వే ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని GASTAT వెల్లడించింది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర డేటాబేస్ ఆధారంగా డిజిటల్ ఎకానమీపై అధ్యయనాలు, గణాంక సూచీలు (ఇండికేటర్లు) అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని పేర్కొంది. అదేవిధంగా పరిశోధకులు, విద్యావేత్తలు, విశ్లేషకులు మరియు ఇతర భాగస్వాములకు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేందుకు అవసరమైన విశ్వసనీయ డేటా సమాచారాన్ని అందించడం కూడా ఈ సర్వే లక్ష్యాల్లో ఒకటని తెలిపింది. సర్వే ద్వారా లభించే డేటా ప్రభుత్వ విధాన రూపకల్పన, నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడుతుందని GASTAT తెలిపింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలోనూ సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







