ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు..!!
- July 07, 2026
దోహా: ఖతార్ జాతీయ విజన్-2030 లక్ష్యాల సాధనలో భాగంగా దేశ భవిష్యత్ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ స్కాలర్‌షిప్ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ బ్యూరో (CGB) వెల్లడించింది. ప్రస్తుత, భవిష్యత్ ఉద్యోగ అవసరాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల కింద కోర్సులను ఎంపిక చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రభుత్వ వర్క్‌ఫోర్స్ ప్లానింగ్ విభాగం పరిశోధకురాలు మరియం జమాల్ అల్ హిత్మి చెప్పారు. దీంతో విద్యార్థులు దేశానికి అత్యంత అవసరమైన రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని, విద్య పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివే విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక తమ స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేందుకు ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటారని వివరించారు. దీనివల్ల కీలక ప్రభుత్వ రంగాల్లో స్థానిక నిపుణులను అందుబాటులోకి తీసుకురావడం సులభమవుతుందని చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, కొత్త పరిశ్రమల ఆవిర్భావం, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కాలర్‌షిప్ కోర్సుల జాబితాను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, హెల్త్ కేర్, ఇంజినీరింగ్, విద్య, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించారు. ఖతార్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆవిష్కరణలు, నాణ్యమైన ప్రభుత్వ సేవల విస్తరణకు అవసరమైన నిపుణులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సులను ఎంపిక చేసినట్లు తెలిపారు. సరైన సమాచారం ఆధారంగా కోర్సును ఎంపిక చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కూడా దోహదపడుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







