కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- July 08, 2026
మనామా: ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తన కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ ను డిజిటలైజ్ చేసింది. దీని ద్వారా పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన వెంటనే, లైసెన్స్ హోల్డర్లు తమ కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్‌ను ఆటోమెటిక్ గ రద్దు చేసుకోవచ్చు. దీంతో ప్రాసెసింగ్ టైమ్ రెండు రోజుల నుంచి రియల్ టైమ్ కు తగ్గిపోతుందని LMRA సర్వీసెస్ మరియు బిజినెస్ అఫైర్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అహ్మద్ ఇబ్రహీం అల్ అరది తెలిపారు.
ప్రభుత్వ సేవలను అభివృద్ధి చేయడానికి బహ్రెయిన్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత కార్యక్రమంలో ఇది కూడా ఒక భాగమన్నారు.జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ అయిన తవాసుల్, పెట్టుబడిదారుల అభిప్రాయాలు మరియు ప్రభుత్వ సీక్రెట్ షాపర్ నివేదికల ద్వారా అందిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మేరకు కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







