సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- July 09, 2026
అమెరికా: సుదీర్ఘ కాలంగా అంతర్యుద్ధం, ఆంక్షలతో నలిగిపోతున్న సిరియాకు అమెరికా ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాల (State Sponsor of Terrorism) జాబితా నుండి సిరియాను తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ కాంగ్రెస్‌కు అధికారికంగా నివేదించారు. డమాస్కస్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ఆ దేశ ఆర్థిక పునర్నిర్మాణానికి ఊతమివ్వడానికి వాషింగ్టన్ తీసుకున్న అత్యంత వ్యూహాత్మక నిర్ణయంగా ఇది నిలవనుంది.
45 రోజుల ముందస్తు నోటీసు.. ట్రంప్‌పై ప్రశంసలు
ఈ నిర్ణయానికి సంబంధించిన 45 రోజుల ముందస్తు నోటీసు పత్రాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కాంగ్రెస్‌కు సమర్పించారు. సిరియా ప్రజల భవిష్యత్తును మార్చేందుకు, వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరొక చారిత్రాత్మక నిర్ణయం ఇదని రూబియో కొనియాడారు.
టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ట్రంప్ స్వయంగా ఒక లేఖ ద్వారా ఈ నిర్ణయాన్ని అల్-షరాకు తెలియజేశారు.
అమెరికా కంపెనీలు పెట్టుబడులకు రెడీ: ట్రంప్
“సిరియా పునర్నిర్మాణానికి అడ్డుగా ఉన్న అన్ని రకాల ఆర్థిక, రాజకీయ అడ్డంకులను తొలగిస్తానని నేను గతంలోనే మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడ్డాయి. సిరియాలో పెట్టుబడులు పెట్టడానికి, ఆ దేశాన్ని ఆర్థికంగా మరింత సంపన్నంగా మార్చడానికి అమెరికాకు చెందిన పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి” అని అధ్యక్షుడు ట్రంప్ తన లేఖలో పేర్కొన్నారు.
ఉగ్రవాద దేశాల జాబితా నుండి విముక్తి లభిస్తే.. సిరియాపై ఉన్న అంతర్జాతీయ సహాయ నిరోధాలు, రక్షణ రంగ ఎగుమతులపై ఆంక్షలు, అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఈ నిర్ణయాన్ని సిరియా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సఫ్వాత్ రస్లాన్ హర్షించారు. దీనివల్ల గ్లోబల్ ఎకానమీలో సిరియా మళ్లీ భాగస్వామి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోనే ట్రంప్ కొన్ని ఆంక్షలు ఎత్తివేయగా.. ఇప్పుడు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు సైతం సిరియాలో వందల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి.
అధ్యక్షుడు అల్-షరాపై ట్రంప్ ప్రశంసలు
మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను గద్దె దించి సిరియా పగ్గాలు చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా పరిపాలనను డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాద ముఠా అణచివేతపై అల్-షరా తీసుకుంటున్న కఠిన చర్యలను ట్రంప్ సమర్థించారు. “అతని నాయకత్వాన్ని నాతో పాటు ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 45 రోజుల సమీక్షా గడువు పూర్తి అయిన వెంటనే ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







