పెదాలు మృదుత్వం కోసం పాలూ తేనె!
- August 12, 2016
కాలంతో సంబంధం లేకుండానే కొందరి పెదాలు పొడిబారి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి మెరుపూ దూరమవుతుంది. ఆ సమస్య పరిష్కారానికి ఇంట్లో దొరికే సహజ ఉత్పత్తులూ సాయపడతాయి. అదెలాగంటే...
*
తేనెలో మునివేళ్లను ముంచి.. పెదాలకు రాసుకోవాలి. కాసేపయ్యాక మృదువుగా మర్దన చేసుకోవాలి. పదినిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే తేమ అంది సున్నితంగా మారతాయి.
*
గుప్పెడు రేకల్ని నీళ్లల్లో రెండుమూడు గంటలు నాననివ్వాలి. తరవాత మెత్తగా చేసి దానికి చెంచా పాలు చేర్చి.. పెదాలకు పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక శుభ్రం చేసుకుంటే మురికీ, నలుపుదనం తగ్గిపోయి కాంతిమంతంగా కనిపిస్తాయి.
*
బీట్రూట్ ముక్కల్ని గుజ్జుగా చేసి అందులో గులాబీనీళ్లు కలిపి.. ఐస్ ట్రేలో పోయాలి. దాన్ని డీప్ ఫ్రిజ్‌లో ఉంచి... రెండుమూడు గంటల తరవాత తీయాలి. బీట్రూట్ ఐస్‌క్యూబ్‌లతో పెదాల మీద మర్దన చేసుకోవడం వల్ల చక్కటి చాయ మీ సొంతమవుతుంది.
*
దానిమ్మ గింజలు ఆరోగ్యానికే కాదు... అందానికీ మేలు చేస్తాయి. వీటిలో సహజ బ్లీచింగ్ గుణాలుంటాయి. అందుకే దానిమ్మ గింజల్నుంచి రసం తీసి అందులో దూదిని ముంచి పెదాల మీద అద్దుకోవాలి. వీటిలోని సహజ బ్లీచింగ్ గుణాలు టాన్‌ను పోగొట్టి పెదాలను మృదువుగా మారుస్తాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







