యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- July 11, 2026
అజ్మాన్: యూఏఈలో తొలిసారిగా లాంగెవిటీ మెడిసిన్ (దీర్ఘాయుష్షు వైద్యం), హెల్తీ ఏజింగ్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్, ప్రెసిషన్ హెల్త్ రంగాల్లో అకడమిక్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించేందుకు థంబే గ్రూప్ కీలక ముందడుగు వేసింది. ఇందు కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన జెనీవా కాలేజ్ ఆఫ్ లాంగెవిటీ సైన్స్ (GCLS)తో తుంబే గ్రూప్ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యంతో గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన తుంబే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగెవిటీ మెడిసిన్ ద్వారా ఈ ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో పూర్తిగా లాంగెవిటీ సైన్స్‌కు అంకితమైన తొలి ఉన్నత విద్యా సంస్థగా పేరొందిన GCLS, గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ విద్యా నైపుణ్యం, తుంబే హెల్త్‌కేర్ వైద్య సేవల అనుభవంతో కలిసి మిడిల్ ఈస్ట్ లో లాంగెవిటీ విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త వేదికను ఏర్పాటు చేయనుంది.
ఈ ఒప్పందం యూఏఈని అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ, నివారణ వైద్యం, వైద్య ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే దేశ దృష్టికి అనుగుణంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా మూడు నెలల హైబ్రిడ్ విధానంలో ఆరు అంతర్జాతీయ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సులను ప్రారంభించనున్నారు. ప్రతి కోర్సులో సుమారు 100 మంది అభ్యర్థులను తొలి విడతలో చేర్చుకోనున్నారు. ప్రారంభించనున్న కోర్సులు:
- క్లినికల్ లాంగెవిటీ మెడిసిన్
- లాంగెవిటీ ఫిజియోథెరపీ
- లాంగెవిటీ న్యూట్రిషన్
- లాంగెవిటీ ఫిట్‌నెస్
- పెప్టైడ్ మెడిసిన్
- హెల్త్‌కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఈ కోర్సులు వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, పోషకాహార నిపుణులు, ఫిట్‌నెస్ నిపుణులు మరియు ఇతర ఆరోగ్య రంగ నిపుణులకు ఉపయోగపడేలా రూపొందించారు. స్విస్ అకడమిక్ ప్రమాణాలతో రూపొందించిన పాఠ్యాంశాలను అంతర్జాతీయ అధ్యాపకులు, ప్రాంతీయ వైద్య నిపుణులు బోధించనున్నారు.
తుంబే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తుంబే మొయిదీన్ మాట్లాడుతూ, "జెనీవా కాలేజ్ ఆఫ్ లాంగెవిటీ సైన్స్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయి స్విస్ విద్యా ప్రమాణాలను యూఏఈకి తీసుకొస్తున్నాం. గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీని గల్ఫ్‌లోనే కాకుండా ప్రపంచంలో అగ్రగామి వైద్య విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం" అని తెలిపారు.
జెనీవా కాలేజ్ ఆఫ్ లాంగెవిటీ సైన్స్ అధ్యక్షుడు డాక్టర్ డొమినిక్ థోర్ మాట్లాడుతూ, "లాంగెవిటీ మెడిసిన్ ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక రంగంగా మారుతోంది. ఈ రంగానికి నాణ్యమైన విద్య, శిక్షణ, క్లినికల్ ప్రమాణాలు అత్యవసరం. మధ్యప్రాచ్యంలో ఈ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ సరైన భాగస్వామి" అని పేర్కొన్నారు.
2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, 50కుపైగా విద్యా కార్యక్రమాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తుంబే గ్రూప్ వెల్లడించింది. తొలి బ్యాచ్ సెప్టెంబర్/అక్టోబర్ 2026లో ప్రారంభం కానుంది.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







