కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- July 11, 2026
కువైట్ : కువైట్‌లో ఈ వారాంతంలో తీవ్ర వేడి, దుమ్ముతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంపై ఉపరితల అల్పపీడన వ్యవస్థతో పాటు వేడి గాలుల ప్రభావం కొనసాగుతున్నందున ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ ఖరావీ తెలిపారు.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని, అదే సమయంలో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక రాత్రి వేళల్లో కూడా వాతావరణం వేడిగానే కొనసాగనుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో అప్పుడప్పుడు గాలుల వేగం పెరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే, సముద్ర పరిస్థితులు సాధారణం నుంచి మోస్తరుగా ఉండనున్నాయని, అలల ఎత్తు 2 నుంచి 6 అడుగుల మధ్య ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







