ఎన్టీయార్ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్ : మోహన్‌లాల్
- August 13, 2016
ఒక్క మలయాళంలోనే కాదు.. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఆయన ఓ టాప్ సూపర్ స్టార్. అయినా ఎన్టీయార్, కొరటాల శివ అడగ్గానే 'జనతా గ్యారేజ్'లో ఓ రోల్ చేసేందుకు అంగీకరించారు. అలాంటి స్టార్ హీరో ఎన్టీయార్ అభిమానులకు ఓ విషయంలో సారీ చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో 'జనతా గ్యారేజ్' ఆడియో విడుదల శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఈ సినిమాలో నటించిన అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే అనారోగ్యం కారణంగా సమంత.. బిజీగా ఉండడం వల్ల మోహన్‌లాల్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. అందుకే ఎన్టీయార్ అభిమానులకు సారీ చెబుతూ ఓ వీడియో బైట్ పంపారు మోహన్‌లాల్. 'ఫంక్షన్‌కు రావడానికి వీలైనంత వరకు ట్రై చేశాను. కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల కుదరలేదు. ఎన్టీయార్ అభిమానులందరికీ సారీ. కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్ విడుదలవడం ఆనందంగా ఉంది. ఎన్టీయార్ ఈజ్ మై లవబుల్ బ్రదర్' అని ఆ వీడియోలో చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







