మజ్ను సినిమాలో గెస్ట్ పాత్రలో రాజ్ తరుణ్..
- August 13, 2016
న్యాచురల్ స్టార్ నాని , ఉయ్యాల జంపాలా ఫేం విరించి వర్మ కాంబినేషన్ లో మజ్ను అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జెమిని కిరణ్ నిర్మిస్తున్న మజ్ను చిత్రంలో అను ఇమాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మజ్ను చిత్రంలో ఓ గెస్ట్ పాత్ర ఉండగా, ఆ పాత్రకు యంగ్ హీరో రాజ్ తరణ్ ని ఎంపిక చేశారట. రాజ్ తరుణ్ విరంచి వర్మతో కలిసి ఉయ్యాల జంపాల అనే చిత్రాన్ని చేసాడు కాబట్టి ఆ పరిచయంతోనే ఈ కుర్ర హీరోని ఎంపిక చేసారని చెబుతున్నారు. రాజ్ తరుణ్ కూడా గెస్ట్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఒకవైపు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నా కూడా మరో సినిమాలో గెస్ట్ పాత్రకి ఒప్పుకోవడం అభినందనీయం అని పలువురు ఈ హీరోని ప్రశంసిస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ పాత్ర సినిమా క్లైమాక్స్ లో ఎలివేట్ అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







