12 రిక్రూట్‌మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- July 13, 2026
రియాద్: సౌదీ అరేబియా కార్మిక మార్కెట్‌లో పారదర్శకతను పెంచేందుకు మరియు వినియోగదారుల హక్కులను కాపాడేందుకు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRSD) కఠిన చర్యలు చేపట్టింది. 2026 రెండో త్రైమాసికంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో ఐదు రిక్రూట్‌మెంట్ కార్యాలయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు, మరో ఏడు సంస్థల లైసెన్సులను పూర్తిగా రద్దు చేసింది. నిర్ణీత గడువులోగా తమ తప్పులను సరిదిద్దుకోవడంలో విఫలమైనందుకే ఈ ఏడు సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఆయా సంస్థలు రిక్రూట్‌మెంట్ మరియు లేబర్ సర్వీస్ నిబంధనలను పక్కన పెట్టడ, వినియోగదారులకు రీఫండ్ చేయడంలో తీవ్రంగా ఆలస్యం చేయడం, లబ్ధిదారులు దాఖలు చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైట్స్ అండ్ కాంట్రాక్ట్స్ రక్షణ కోసం రిక్రూట్‌మెంట్ సేవలను పొందే వినియోగదారులు కేవలం ప్రభుత్వ అధికారిక ప్లాట్‌ఫామ్ అయిన 'ముసానెద్' (Musaned) ను మాత్రమే ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. దీని ద్వారా లైసెన్స్ పొందిన సంస్థలతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒప్పందాలు చేసుకోవచ్చని, రేటింగ్స్ ఇవ్వడంతో పాటు ఫిర్యాదుల స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చని తెలిపింది.
భవిష్యత్తులోనూ ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఏదైనా ఉల్లంఘనలు జరిగితే యునిఫైడ్ హాట్‌లైన్ (920002866) ద్వారా లేదా ముసానెద్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







