ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- July 13, 2026
జెడ్డా: ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల సౌదీ అరేబియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా పాలకుడు (కస్టోడియన్ ఆఫ్ ది టూ హోలీ మాస్క్స్) కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్.. ప్రస్తుత ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి విడివిడిగా పంపిన సందేశాలలో తమ గాఢ సెంాపాన్ని తెలియజేశారు.
షేక్ హమద్ మరణవార్త తనను తీవ్ర వేదనకు గురిచేసిందని కింగ్ సల్మాన్ తన సందేశంలో పేర్కొన్నారు. మాజీ అమీర్ తన దేశానికి, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. ఖతార్ అమీర్ షేక్ తమీమ్‌కు, అల్ థానీ రాజకుటుంబానికి మరియు ఖతార్ ప్రజలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కూడా ఖతార్ మాజీ పాలకుడి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఖతార్ దేశ ప్రగతిలో షేక్ హమద్ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఖతార్ అమీర్ షేక్ తమీమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







