రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- July 14, 2026
మనామా: బహ్రెయిన్‌కు చెందిన రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన సేవా ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా మానవతా సేవలు, స్థిరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో సంస్థ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సేవా కార్యక్రమాలకు బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా నాయకత్వం, మద్దతు అందించారని సంస్థ పేర్కొంది.
ఫౌండేషన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఇంజి. ఇబ్రహీం దల్హాన్ అల్ దోసెరి మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో RHF బహ్రెయిన్‌తో పాటు ప్రాంతీయ స్థాయిలో ప్రముఖ మానవతా సంస్థగా ఎదిగిందన్నారు. అనాథలు, వితంతువులకు సామాజిక, అభివృద్ధి పరమైన సహాయాన్ని అందించడంతో పాటు వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
2001లో స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటివరకు 32,423 మంది అనాథలు, వితంతువులకు RHF సహాయం అందించగా, 75 వేలకుపైగా మానవతా సహాయ కార్యక్రమాలను నిర్వహించింది. అంతేకాకుండా సంక్షోభాల ప్రభావిత 17 దేశాల్లో సహాయక చర్యలు, అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తూ తన సేవలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







