ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- July 14, 2026
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో చిరుజల్లులు, డస్ట్ తో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ (Oman Meteorology Office) హెచ్చరించింది. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్ హజర్ పర్వత శ్రేణులు మరియు సమీప ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ధోఫార్ తీరప్రాంతం మరియు సమీప పర్వత ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే..అల్ జాజర్, అల్ దుక్మ్, మహౌత్, అల్ అష్ఖరా, జలాన్ బనీ బు అలీ, జలాన్ బనీ బు హసన్, సదా, షలీమ్, హల్లానియాత్ దీవులు సహా తూర్పు, మధ్య గవర్నరేట్లలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ గాలుల కారణంగా దుమ్ము(డస్ట్) ఎగసిపడటం, బహిరంగ ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గిపోవడం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర గవర్నరేట్లలో గాలిలో దుమ్ము కణాలు పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తక్కువ విజిబిలిటీ, బలమైన గాలులు, వర్షాలు ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







