ఫిఫా వరల్డ్ కప్ సెమీస్‌లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- July 15, 2026
టెక్సాస్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ జట్టు సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది. టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బలిష్టమైన ఫ్రాన్స్ జట్టుకు గట్టి షాకిస్తూ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. టెక్సాస్‌లోని ఏటీ&టీ (AT&T) స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించింది. 2010లో ప్రపంచ కప్ ముద్దాడిన తర్వాత స్పెయిన్ మళ్లీ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఒయర్జాబల్, పెడ్రో పోరోల అద్భుత గోల్స్!
మ్యాచ్ ప్రారంభమైన నిమిషం నుంచే స్పెయిన్ ప్లేయర్లు మైదానంలో పూర్తి పట్టు కనబరిచారు. ఆట 22వ నిమిషంలో స్పెయిన్ యువ ఆటగాడు లామిన్ యమాల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నే ఫౌల్ చేయడంతో రిఫరీ పెనాల్టీ ఇచ్చారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందుకున్న మికెల్ ఒయర్జాబల్ బంతిని గోల్‌గా మలిచి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అదే ఊపును కొనసాగిస్తూ, ఆట 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన పాస్‌ను పెడ్రో పోరో సూపర్ గోల్‌గా మార్చి స్పెయిన్ ఆధిక్యాన్ని 2-0 కు పెంచి గెలుపును ఖాయం చేశాడు.
FIFA World Cup 2026: ఎంబాపే మ్యాజిక్ ఫెయిల్.. ఫ్రాన్స్ కోచ్‌కు చేదు వీడ్కోలు
ఈ కీలక పోరులో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపెలతో పాటు ఆ జట్టు అటాకింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది. స్పెయిన్ పటిష్టమైన డిఫెన్స్ లైన్ ఫ్రాన్స్ ఆటగాళ్లను అసలు గోల్ పోస్ట్ వైపు కూడా రానివ్వకుండా కట్టడి చేసింది. దీంతో వరుసగా మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరాలనే ఫ్రాన్స్ కల చెదిరిపోయింది. అలాగే దాదాపు 14 సంవత్సరాలుగా ఫ్రాన్స్ జట్టు హెడ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న డిడియర్ డెషాంప్స్‌కు ఈ ఓటమి ఒక చేదు వీడ్కోలుగా మిగిలింది.
తమ జట్టు సమష్టి కృషి వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని, ఫ్రాన్స్ వ్యూహాలను విజయవంతంగా తిప్పికొట్టామని స్పెయిన్ మేనేజర్ లూయిస్ డి లా ఫ్యూయెంటె సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఆదివారం న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో.. అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో స్పెయిన్ టైటిల్ కోసం తలపడనుంది.
తాజా వార్తలు
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్‌పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్‌లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!







