స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- July 15, 2026
జెద్దా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జెద్దాలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇందులో 'స్టేట్ రెవెన్యూ చట్టాన్ని' ఆమోదించడంతో పాటు, అంతర్జాతీయ ట్రైనీల కోసం కొత్త 'ట్రైనింగ్ వీసా'ను ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సమావేశంలో క్రౌన్ ప్రిన్స్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన ఫోన్ సంభాషణ వివరాలను క్యాబినెట్‌కు వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. అలాగే కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీతో జరిగిన అధికారిక చర్చల వివరాలను కూడా వెల్లడించారు.
సౌదీ విజన్ 2030, కెనడా ఆర్థిక వృద్ధి ఎజెండాలకు అనుగుణంగా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా సౌదీ-కెనడియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు, ఇంధన రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాలను క్యాబినెట్ అభినందించింది.
ప్రాంతీయ పరిణామాలు - భద్రతపై చర్చ
ప్రాంతీయ భద్రతను సమీక్షించిన క్యాబినెట్.. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై, అలాగే కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, జోర్డాన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పదేపదే జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను సౌదీ అరేబియా ఎంతమాత్రం అంగీకరించబోదని స్పష్టం చేసింది. మరోవైపు, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితా నుండి సిరియాను తొలగించే ప్రక్రియను ప్రారంభించాలనే అమెరికా నిర్ణయాన్ని స్వాగతించారు. సిరియాలో స్థిరత్వం, పునర్నిర్మాణానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుందని క్యాబినెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







