ఖతార్‌లో తీవ్రమైన ఎండలు, తేమ.. వాతావరణ శాఖ వెల్లడి..!!
- July 16, 2026
దోహా: జూలై 16 నుంచి ఖతార్‌లో వేసవిలో అత్యంత వేడిగా ఉండే కాలం ప్రారంభమవుతుందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) వెల్లడించింది. అల్-హన్అహ్ (Al-Han'ah) నక్షత్రం ఉదయించడంతో ఈ దశ ప్రారంభమవుతుందని తెలిపింది.ఈ నక్షత్రం 13 రోజుల పాటు కనిపించనుంది. ఈ కాలాన్ని స్థానికంగా "జమ్రత్ అల్-ఖయ్జ్" అని పిలుస్తారు. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుని, అర్ధరాత్రి వరకు కూడా వేడి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే, ఈ దశలో పొడి వాతావరణం క్రమంగా తగ్గి, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గాలిలో తేమ (హ్యూమిడిటీ) పెరుగుతుందని తెలిపింది. దీంతో పొగమంచు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఇదే సమయంలో గాలుల వేగం సాధారణంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







