దుబాయ్‌లో కొత్త రికార్డు.. ఎమిరేట్స్ హిల్స్‌లో విల్లాకు Dh17 మిలియన్ల అద్దె..!!
- July 16, 2026
దుబాయ్: దుబాయ్‌లోని విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఎమిరేట్స్ హిల్స్ ప్రాంతంలోని ఏడు బెడ్‌రూమ్‌ల విల్లా "ది ప్యాలెస్"ను ఏడాదికి 17 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు 4.6 మిలియన్ డాలర్లు) అద్దెకు ఇవ్వడం ద్వారా దుబాయ్ చరిత్రలో అత్యధిక వార్షిక అద్దె నివాసంగా నిలిచింది. "బిలియనీర్ రో"గా పేరొందిన ప్రాంతంలో ఉన్న ఈ విల్లా రూపకల్పన, పునర్నిర్మాణం, ప్రాజెక్టు నిర్వహణను ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ నిపుణురాలు లీన్ కింగ్ తన బృందంతో కలిసి పనిచేశారు.
లీన్ కింగ్ మాట్లాడుతూ.. ఎక్కువ మొత్తంలో వచ్చిన ఇతర ఆఫర్లను కూడా తిరస్కరించామని, కేవలం అధిక అద్దె కాకుండా ఈ ఇంటి ప్రత్యేకత, నిర్మాణ నాణ్యత, అరుదైన పురాతన వస్తువుల విలువను అర్థం చేసుకునే అద్దెదారునే ఎంపిక చేశామని తెలిపారు. ఈ లీజు ఒప్పందంతో ఈ ఏడాది బుర్జ్ ఖలీఫాలోని డూప్లెక్స్ పెంట్‌హౌస్ నెలకొల్పిన ఏడాదికి 12 మిలియన్ దిర్హమ్‌ల అద్దె రికార్డు బద్దలైంది.ఎమిరేట్స్ హిల్స్ ఇప్పటికే దుబాయ్‌లో అత్యంత విలాసవంతమైన నివాస ప్రాంతంగా, ప్రపంచంలోని సంపన్నులు నివసించే చిరునామాగా గుర్తింపు పొందింది. ఈ తాజా రికార్డు దుబాయ్ ప్రపంచ స్థాయి లగ్జరీ రియల్ ఎస్టేట్ కేంద్రంగా మరింత బలపడుతున్నదనడానికి నిదర్శనమని లీన్ కింగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







