రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- July 16, 2026
రియాద్: మిడిలీస్టులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా, అమెరికా మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించనున్నారు. ఈ మేరకు ఈ అంశంపై ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చించారు.
సౌదీ అరేబియా సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ ఫయ్యాద్ అల్-రువైలీ, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్యాట్రిక్ ఫ్రాంక్ తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా రక్షణ భాగస్వామ్యాన్ని విస్తరించే అవకాశాలపై ఇరువురు అధికారులు సమీక్షించారు.
ప్రాంతీయ భద్రత, సైనిక సమన్వయం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







