ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- July 17, 2026
దోహా: ఖతార్ పై జరిగిన పలు వైమానిక దాడుల యత్నాలను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెల్లవారుజామున ప్రకటించింది.
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశ గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన వైమానిక ముప్పులను నిరంతరం గుర్తించి నిర్వీర్యం చేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొంది.
మరోవైపు, అడ్డుకున్న దాడుల శకలాలు కింద పడటంతో ఓ బాలుడు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అతడికి వెంటనే వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
పరిస్థితిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వర్గాలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాలని ఖతార్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







