ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- July 18, 2026
కువైట్ సిటీ: ఇరాన్ దాడి నేపథ్యంలో కువైట్‌లోని విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ (ఉప్పునీటి శుద్ధి) కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు కువైట్ విద్యుత్, జలవనరులు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కువైట్ న్యూస్ ఏజెన్సీ (కునా) కథనం ప్రకారం, శత్రుదాడి కారణంగా విద్యుత్ ఉత్పత్తి, నీటి డీసాలినేషన్ కేంద్రంలోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికుల భద్రత, విద్యుత్ సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్‌లోని పలు యూనిట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్నిమాపక బృందాలు, కువైట్ ఫైర్ ఫోర్స్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
దాడి జరిగిన వెంటనే అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను అమల్లోకి తీసుకువచ్చామని, విద్యుత్, నీటి సేవలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రజలు విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉండే గరిష్ట వినియోగ సమయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







